T Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టీ హబ్లో ఇన్వెస్టర్ కనెక్ట్ సదస్సును మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ సంస్థ చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు. ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండి సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు వారిని ప్రోత్సహించడానికి పెట్టుబడుల పరంగా సహకారాన్ని అందించడానికి ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దేశంలోని ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులైన కలారీ క్యాపిటల్, ఆర్కా మీడియా వర్క్స్, ఎంథిల్ వెంచర్స్, ఎండ్రియా పార్టనర్స్, సక్సీడ్ ఇన్నోవేషన్ ఫండ్, పేవ్స్టోన్, ఎన్టీటీ డాటా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.