LTCG Tax | సొంతింటి కల సాకారం చేస్తామన్న మోదీజీ.. కానీ ఇండ్లపై ఎల్టీసీజీ టాక్స్ వడ్డన..?!
LTCG Tax | అందరికీ సొంతింటి కల సాకారం చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్.. ఇండ్లపై దీర్ఘకాలిక పెట్టుబడులను కొత్త ఇండ్ల కొనుగోలు, నిర్మాణానికి బదిలీ చేయడంపై పరిమితులు విధించింది. రూ.10 కోట్ల పరిమితి దాటితే పన్ను చెల్లించాల్సిందే.
LTCG Tax | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్… అవకాశం ఉన్న మేరకు అన్ని వర్గాల నుంచి పన్ను వసూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నది. వచ్చే4 ఆర్థిక సంవత్సరం నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు ఎత్తేసింది. గతంలోనూ పెట్టుబడులు లేదా పొదుపు పథకాలతో పన్ను మినహాయింపులు గల పాత పన్ను విధానం స్థానే కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. కొత్త పన్ను పాలసీ ఆకర్షణీయంగా లేకపోవడంతో తాజాగా కొన్ని పరిమిత మినహాయింపులతో దాన్ని డీఫాల్ట్‌గా పెట్టేసింది. అంటే వేతన జీవులు పాత పన్ను పాలసీని ఎంచుకోకపోతే నూతన పన్ను పాలసీ కిందే ఆదాయాన్ని గడిస్తారన్న మాట.. ఇక మరో అడుగు ముందుకేసి ఆదాయం పన్నుచట్టంలోని నివాస ఆస్తులపై పెట్టుబడుల మీద కూడా క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపుపై సీలింగ్ తీసుకొచ్చింది.
గతంలో ఆదాయం పన్ను చట్టంలోని 54,54ఎఫ్ సెక్షన్ల కింద రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌పై రీఇన్వెస్ట్మెంట్ ద్వారా దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల పన్ను (ఎల్టీసీజీ) మినహాయింపునకు పరిమితులే లేవు. కానీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌పై రూ.10 కోట్ల రీఇన్వెస్ట్మెంట్ వరకు మాత్రమే ఎల్టీసీజీ మినహాయింపు ఇచ్చింది. అంతకుమించి పెట్టే పెట్టుబడులపై ఎల్టీసీజీ టాక్స్ పే చేయాల్సిందే.
దేశవ్యాప్తంగా ఇండ్ల కొరత నివారణతోపాటు ఇండ్ల నిర్మాణ పరిశ్రమకు ఉద్దీపన పథకం అమలు చేసేందుకు ఆదాయం పన్ను చట్టంలో 54, 54ఎఫ్ సెక్షన్ల కింద రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌పై రీఇన్వెస్ట్మెంట్కు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎల్టీసీజీ టాక్స్ మినహాయింపు ఇచ్చింది. కానీ, 2014 ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో సొంతిల్లు కల సాకారం చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చింది నరేంద్రమోదీ సర్కార్. ఇప్పటి వరకు ఈ సెక్షన్ల కింద సంపన్నులు పన్ను డిడక్షన్లు క్లయిమ్ చేసిన దాఖలాలు లేవు. కానీ.. ఈ రెండు సెక్షన్ల కింద ఎల్టీసీజీ టాక్స్ మినహాయింపునకు పరిమితులు విధించడం ఆసక్తికర పరిణామం.
54, 54ఎఫ్ సెక్షన్ల కింద మినహాయింపు ఇలా
రెసిడెన్షియల్ ప్రాపర్టీపై వచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలను మరో రెసిడెన్షియల్ ప్రాపర్టీలో పెట్టుబడి పెడితే ఆదాయం పన్ను చట్టంలోని 54 సెక్షన్ కింద ఎల్టీసీజీ ట్యాక్స్ మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఒక ఇంటిపై వచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలను బదిలీ చేసిన రెండు లేదా మూడేండ్ల లోపు కొత్త ఆస్తి కొనుగోలు చేయాలి.. లేదా కొత్త ఇల్లు నిర్మించాలి. అప్పుడే 54 సెక్షన్ కింద ఎల్టీసీజీ టాక్స్ మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌లో రీఇన్వెస్ట్మెంట్కు ఇతర పెట్టుబడులను ట్రాన్స్ఫర్ చేస్తే 54ఎఫ్ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు.
కానీ, ఈ మినహాయింపులకు పరిమితులు విధిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆదాయం పన్నుశాఖకు కేంద్రం సవరణలు తెచ్చింది. ఆదాయం పన్ను చట్టంలోని 54 సెక్షన్లో సబ్‌సెక్షన్ 2, 54ఎఫ్ సెక్షన్లో సబ్ సెక్షన్ 4 తీసుకొచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

