ELSS | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగింపు దశకు చేరుకుంటున్నది. వేతన జీవులు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్‌లో పన్ను రాయితీ క్లయిమ్ చేయడానికి పొదుపు పథకాల్లో నిధులు డిపాజిట్ చేయాలి. అలా నిధులు పెట్టుబడి పెట్టడానికి మార్చి 31 చివరి తేదీ. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మంచి లాభాలతో టాక్స్ మినహాయింపు బెనిఫిట్లు కల్పించే పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అటువంటి పథకాల్లో ఒకటి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్). గత ఏడాది కాలంలో ఈఎల్ఎస్ఎస్ క్యాటగిరీలో 10 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి.
ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పొదుపు పథకాల్లో రూ.1.5 లక్షల పెట్టుబడి వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈఎల్ఎస్ఎస్ కింద రూ.1.5 లక్షలు పొదుపు చేయొచ్చు. మీ పన్ను ఆధారిత ఆదాయంలో రూ.1.5లక్షలు మినహాయింపు ఇస్తారు.
ఈఎల్ఎస్ఎస్ పథకానికి మూడేండ్ల లాక్ఇన్ పీరియడ్ ఉంటుంది. మూడేండ్ల తర్వాత మాత్రమే ఈ పథకం నుంచి పెట్టుబడులు విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ పథకంలో ఇది చాలా మంచి ఆప్షన్. మిగతా పెట్టుబడి పథకాలతో పోలిస్తే లాక్ ఇన్ పీరియడ్ చాలా తక్కువ. లాక్ ఇన్ పీరియడ్ తర్వాత ఇన్వెస్టర్ తన పెట్టుబడి కొనసాగించొచ్చు. సుదీర్ఘకాలం ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెనిఫిట్ కల్పిస్తుంది.
ఈఎల్ఎస్ఎస్ పథకంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ-సిప్) కింద రూ.500తో పెట్టుబడి ప్రారంభించొచ్చు. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు.ఈ పథకంలో రెండు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది గ్రోత్ ఆప్షన్, రెండో పథకంలో డివిడెండ్ చెల్లిస్తారు. తొలి స్కీమ్‌లో కొనసాగితే వృద్ధి పెరుగుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి బదులు ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)లో పొదుపు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సిప్ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టాల్సిందే. ప్రతి నెలా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్లో ఒడిదొడుకుల నుంచి రిస్క్ తగ్గుతుంది.
ఫండ్ హౌజ్ ———————————— ఏడాదిలో ———- మూడేండ్లలో
రిటర్న్స్ (%) ——- రిటర్న్స్ (%)
బీవోబీ ఈఎల్ఎస్ఎస్96 ప్లాన్ 1 ————– 8.49% —————- 17.55%
ఎస్బీఐ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్ ———– 12.7% —————– 18.18%
ఖ్వాంట్ టాక్స్ సేవర్ ఫండ్ —————— 9.53% —————- 36.58%
హెచ్డీఎఫ్సీ టాక్స్ సేవర్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ —- 15.22% ————–18.58%
కొటక్ టాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ——– 9.66% —————- 17.60%