హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాలతో పోలిస్తే టెక్స్టైల్ రంగం అభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. శుక్రవారం సచివాలయంలో తైవాన్ టెక్స్టైల్ ఫెడరేషన్ (టీటీఎఫ్) అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలో 11 మంది ప్రతినిధుల బృందం మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వల్పకాలంలోనే టెక్స్టైల్ రంగంలో ఇతర రాష్ర్టాలకు ధీటుగా ఎదిగిందని, రాష్ట్ర పారిశ్రామిక జీఎస్వీఏ 2024-25లో రూ.2.77 లక్షల కోట్లుగా ఉందని చెప్పారు. ఇందులో టెక్స్టైల్ రంగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.