రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత నెల ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీరేట్లు వార్షిక ప్రాతిపదికన ఇలా ఉన్నాయి.
ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ విధానంలో తీసుకొనే గృహ రుణాలపై వడ్డీరేట్లు రుణ కాలపరిమితి అంతటా ఒకేలా ఉంటాయి. మొదట్నుంచి, చివరిదాకా ఎటువంటి మార్పుల్లేకుండా ఒకేలా ఉంటాయి. అయితే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో వడ్డీరేట్లు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. ఇది ఆర్బీఐ రెపోరేటు తదితర బెంచ్మార్క్ ఇండెక్స్లపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రెపోరేటు తగ్గితే రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. పెరిగితే వడ్డీరేట్లు కూడా పెరుగుతాయి.
గృహ రుణాలపై సాధారణంగా వడ్డీని నెలవారీగా లేదా ఏడాది చొప్పున లేదా రోజువారీగా తగ్గింపు ఆధారంగా లెక్కిస్తారు. బ్యాంక్లో తీసుకున్న రుణంలో మీరు చెల్లించాల్సిన అసలుపై ఇది ఆధారపడి ఉంటుంది.
