హైదరాబాద్, ఏప్రిల్ 11: కెనరా బ్యాంక్ ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిం ది. ఒక్క రోజు, నెల, మూడు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేటు)ని యథాతథంగా ఉంచిన బ్యాంక్..ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటును పెంచింది. ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు 8.40 శాతం నుంచి 8.45 శాతానికి, ఏడాది రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి సవరించింది.