Interest Rate | చిన్నమొత్తాలపై వడ్డీ యథాతథం.. ఎలాంటి మార్పులు లేవన్న కేంద్రం
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1తో మొదలయ్యే త్రైమాసికానికిగాను ఆయా స్కీములపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Interest Rate | న్యూఢిల్లీ, మార్చి 8: చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1తో మొదలయ్యే త్రైమాసికానికిగాను ఆయా స్కీములపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో జూన్ 30 వరకు వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉండనున్నాయి. కాగా, ప్రస్తుతం సుకన్య సమృద్ధి స్కీం వడ్డీరేటు 8.2 శాతంగా ఉన్నది. అలాగే మూడేండ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీరేటు 7.1 శాతం.
ఇక ఎంతో ప్రజాదరణ కలిగిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)పై 7.1 శాతం, సేవింగ్స్ డిపాజిట్లకు 4 శాతం చొప్పున వడ్డీరేట్లు చెల్లిస్తున్నారు. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)కు 7.5 శాతంగా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ)పై 7.7 శాతంగా వడ్డీరేట్లున్నాయి. మంత్లీ ఇన్కమ్ స్కీం వడ్డీరేటు 7.4 శాతం. ఎక్కువగా పోస్టాఫీసుల ద్వారా నడుస్తున్న ఈ చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తుందన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- interest
- Interest Rates
- KVP
- NSP
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

