హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన జేబీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకుగాను కొత్తగా ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను శనివారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా సంస్థలు కళాశాల స్థాయిలోనే ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా కొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు పుట్టుకువస్తాయన్నారు. అలాంటి వారికి రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లోనూ ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా సహకారం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని నిపుణులు అందుబాటులో ఉన్నారన్నారు.