Infinix Zero 30 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తయారు చేసిన ఫోన్.. ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G) త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. గత డిసెంబర్లో మార్కెట్లో ఆవిష్కరించిన ఇన్ఫినిక్స్ జీరో20 5జీ ఫోన్ కొనసాగింపుగా ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ (Infinix Zero 30 5G) వస్తోంది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ వచ్చేనెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తు్న్నది. మీడియాటెక్ హెలియో జీ99 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ ఫోన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 13-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ, వీడియో చాటింగ్ కోసం 50-మెగా పిక్సెల్ ఫ్రంట్ సెన్సర్ కెమెరాతో వస్తుంది.
ఇరువైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఇన్ఫినిక్స్ జీరో30 5జీ ఫోన్ 6.78-అంగుళాల కర్వుడ్ 10-బిట్ అమోలెడ్ ప్యానెల్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్‌తో వస్తుంది.
లావెండర్, గోల్డెన్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఇన్ఫినిక్స్ జీరో30 5జీ ఫోన్ వస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.25 వేలలోపే ఉండొచ్చునని భావిస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తున్నది.