Infinix Note 40 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (iQoo) భారత్ మార్కెట్లోకి తన ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ ఫోన్ను శనివారం ఆవిష్కరించింది. గత ఏప్రిల్ నెలలోనే ఐక్యూ తన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో, ఇన్ఫినిక్స్ నోట్ 40+ ఫోన్లను తీసుకొచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ తో పని చేస్తోంది ఇన్ఫినిక్స్. 100 వాట్ల వైర్డ్ చార్జింగ్, 20వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో కూడిన బ్యాటరీ, 108 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో+ రేసింగ్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999 పలుకుతుంది. ఈ ధరలు బ్యాంకు రాయితీలతో కలిపి వెల్లడించినట్లు తెలుస్తున్నది. ఈ నెల 26 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా రెండు ఫోన్లు విక్రయిస్తారు.ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఫోన్, ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో+ రేసింగ్ ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2436 పిక్సెల్స్) కర్వ్డ్ ఎల్టీపీఎస్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కూడా ఉంటుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫోన్ లో పలు మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. వీసీ కూలింగ్ టెక్నాలజీ 2.0తో 11 లేయర్ల హీట్ డిస్సిపాషన్ మెటీరియల్ ఉంటుంది. 108 మెగా పిక్సెల్ కెమెరా విత్ రెండు అన్ స్పెసిఫైడ్ సెన్సర్లు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. జేబీఎల్ ట్యూన్ చేసిన డ్యుయల్ స్పీకర్లు జత చేశారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది.
ఇన్ ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిసన్ ఫోన్ 45వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ.. ఇన్ ఫినిక్స్ నోట్ 40 ప్రో + రేసింగ్ ఎడిసన్ ఫోన్ 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4600 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. పవర్ మేనేజ్మెంట్ చీతా ఎక్స్1 చిప్ ఉంటుంది. రెండు మోడర్లు 20వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతు కలిగి ఉండటంతోపాటు అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.