Infinix Note 40 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ను ఈ నెల 21న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత ఏప్రిల్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ (Infinix Note 40 Pro 5G) ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) వస్తోంది.
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ (Infinix Note 40 5G) ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ స్లైట్లీ రైజ్డ్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ కలిగి ఉంటుంది. 93.8 శాతం స్క్రీన్ టూ రేషియో, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ మ్యాగ్ చార్జ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నట్లు ధృవీకరించారు. జేబీఎల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ లో ఇమ్మర్సివ్ ఆడియో, 360- డిగ్రీ సిమ్మెట్రికల్ సౌండ్, బూస్టెడ్ బాస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఫిలిప్పైన్స్ లో ఆవిష్కరించిన ఇన్ ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 108-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, రెండు 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయని తెలుస్తున్నది.