Infinix Hot 40i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ (Infinix) తన ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్‌ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. ఒక్టాకోర్ యూనిసోక్ చిప్సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఇంతకుముందు సౌదీ అరేబియాలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది ఇన్ఫినిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మద్దతుతో డ్యుయల్ రేర్ కెమెరా సిస్టమ్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంది. నాలుగు కలర్స్ ఆప్షన్లలో వస్తున్న ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ విక్రయాలు ఈ నెలాఖరులో ప్రారంభం అవుతాయి.
హరిజాన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్లిట్ బ్లాక్, స్టా్ర్ఫాల్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ లభిస్తుంది. ఈ నెల 21 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ (Infinix Hot 40i) ఫోన్ 6.5-అంగుళాల హెచ్డీ+ (1,612x 720 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ606 చిప్సెట్తో వస్తోంది. వర్చువల్‌గా 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎక్స్ఓఎస్ 13.0 వర్షన్‌పై ఫోన్ చేసింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుందీ ఫోన్. అదనంగా ఏఐ బ్యాక్డ్ సెన్సర్ విత్ క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ కూడా ఉంటది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం డ్యుయల్ ఫ్లాష్‌తోపాటు 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఆపిల్ ఐ-ఫోన్ లో డైనమిక్ ఐలాండ్ తరహాలో సెల్ఫీ కెమెరా మ్యాజిక్ రింగ్ ఫీచర్ ఉంటుంది.
18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 256 జీబీ స్టోరేజీ ఆప్షన్ గల ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ పెంచుకోవచ్చు. వై-ఫై, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, జీపీఎస్, ఎఫ్ఎం, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఐపీ53 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంటుంది.