న్యూఢిల్లీ, జూలై 18: ఏప్రిల్-జూన్లో రూ.2,124 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది ఇండస్ఇండ్ బ్యాంక్. మొండి బకాయిలు తగ్గడంతో అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,631 కోట్లతో పోలిస్తే 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.10,113 కోట్ల నుంచి రూ.12,939 కోట్లకు ఎగబాకింది.