న్యూఢిల్లీ, జనవరి 2: వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ పబ్లిక్ ఇష్యూనకు అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 225.57 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి. రూ.260 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 84.70 లక్షల షేర్లను విక్రయించడానికి పెట్టగా..దీనికి 192 కోట్ల షేర్లకు బిడ్డింగ్లు దాఖలయ్యాయి.
అంటే రూ.260 కోట్ల ఐపీవోకి రూ.41,459 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.78 కోట్లు సేకరించిన సంస్థ. షేరు ధరల శ్రేణిని రూ.204-215గా నిర్ణయించింది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించిన 86 లక్షల ఈక్విటీ షేర్లలో 35 లక్షల షేర్లు ప్రమోటర్ రణ్బీర్ సింగ్నకు చెందినవి.