న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.2,998.1 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 1,422.6 కోట్లతో పోలిస్తే రెండింతలు పెరిగింది.
ఈ సందర్భంగా ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పన్నులు చెల్లించిన తర్వాత 30 బిలియన్ రూపాయల లాభాన్ని గడించినట్లు, వరుసగా ఐదో త్రైమాసికంలోనూ లాభాలు అందుకోవడం విశేషమన్నారు. కరోనాతో కుదేలైన విమానయాన రంగం తిరిగి కోలుకున్నదన్నారు. గత త్రైమాసికానికిగాను కంపెనీ ఆదాయం రూ.15,410.2 కోట్ల నుంచి రూ.20,062.3 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో ప్యాసింజర్ విమాన టికెట్లపై వచ్చే ఆదాయం 30 శాతం పుంజుకొని రూ.17,157 కోబీవోఐ ప్రాఫిట్లో 62 శాతం వృద్ధిట్లు ఆర్జించింది.