న్యూఢిల్లీ, జనవరి 24: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,450 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,986 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం తగ్గింది. కంపెనీ ఆదాయం రూ.20,062 కోట్ల నుంచి రూ.22,992 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది.