ఇండిగోకు ఇంధన సెగ
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో నష్టాల పరంపర కొనసాగుతున్నది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,879.1 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది.
- క్యూ2లో రూ.1,879 కోట్ల నష్టం
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో నష్టాల పరంపర కొనసాగుతున్నది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,879.1 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఇంధన ఖర్చులు పెరగడంతోపాటు రూపాయి పతనం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,582.1 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా తగ్గింది.
సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ.19,599.5 కోట్ల నుంచి రూ.24,311.9 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, నిర్వహణ ఖర్చులు రూ.26,188.3 కోట్లకు చేరుకోగా, దీంట్లో ఇంధనం కోసం పెట్టే ఖర్చు 67.2 శాతం అందుకొని రూ.9,966.8 కోట్లకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఇండిగో సీఈవో విల్లీ వాల్ష్ మాట్లాడుతూ..పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తోడు ఇంధనం కోసం పెట్టే ఖర్చు అధికం కావడం ప్రతికూల ప్రభావం చూపాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

