Indigo Flight | హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త. ఇండిగో విమానయాన సంస్థ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్‌ను ప్రారంభించింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి సోమవారం తెల్లవారుజామున 3:55 గంటలకు తొలి ఇండిగో విమానం బ్యాంకాక్‌కు బయల్దేరింది. రేపు ఉదయం 9:05 గంటలకు బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కానుంది.
ఇండిగో విమానయాన సంస్థ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, భువనేశ్వర్ నుంచి నేరుగా బ్యాంకాక్‌కు విమానాలను నడుపుతోంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ప్రారంభమయ్యాయి. దీంతో ఇండియా నుంచి బ్యాంకాక్ వెళ్లే ఇండిగో విమానాల సంఖ్య 37కు చేరుకుంది.