వాణిజ్య లోటు పైపైకి.. గత నెలలో 5 నెలల గరిష్ఠానికి చేరిక
దేశంలో ఎగుమతులను మించి దిగుమతులవుతున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే జూన్‌లో 5 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 30.43 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జూన్‌లో 19.1 బిలియన్ డాలర్లే. అయితే ఈ ఏడాది జనవరిలో 34.68 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
- జూన్‌లో 30.43 బిలియన్ డాలర్లుగా నమోదు
న్యూఢిల్లీ, జూలై 13 : దేశంలో ఎగుమతులను మించి దిగుమతులవుతున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు అంతకంతకు పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే జూన్‌లో 5 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 30.43 బిలియన్ డాలర్లుగా నమోదైంది. నిరుడు జూన్‌లో 19.1 బిలియన్ డాలర్లే. అయితే ఈ ఏడాది జనవరిలో 34.68 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఆ తర్వాత ఆ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. కాగా, అధిక ముడి చమురు ధరలే ఇందుకు కారణమని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గత నెల దేశీయ క్రూడాయిల్ దిగుమతులు 19.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతంతో పోల్చితే 40 శాతం పెరిగాయి.
ఎగుమతులు
జూన్‌లో ఇతర దేశాలకు దేశం నుంచి 40.41 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. మునుపటితో చూస్తే 15.5 శాతం వృద్ధి కనిపించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో 15.92 శాతం పుంజుకొని 129.32 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 19.89 శాతం పెరిగి 216.18 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఈ మూడు నెలల్లో వాణిజ్య లోటు 86.86 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 68.75 బిలియన్ డాలర్లే. కాగా, గత నెలలో ఎలక్ట్రానిక్స్, ఐరన్ ఓర్, హస్తకళలు, మాంసం, పాల ఉత్పత్తుల ఎగుమతులు ఆకర్షణీయంగా జరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఈ సందర్భంగా తెలిపారు.
అమెరికాతో..
భారత్ నుంచి అమెరికాకు జూన్‌లో ఎగుమతులు 1.21 శాతం తగ్గిపోయాయి. 8.17 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అయితే దిగుమతులు మాత్రం 33.86 శాతం ఎగిసి 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి. నిరుడు జూన్‌లో ఎగుమతులు 8.27 బిలియన్ డాలర్లు, దిగుమతులు 4.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏప్రిల్-జూన్‌లో ఎగుమతులు 25.46 బిలియన్ డాలర్లుగా ఉంటే, దిగుమతులు మాత్రం 23.82 శాతం ఎగబాకి 16.65 బిలియన్ డాలర్లను తాకాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

