నాలుగు నెలల కనిష్ఠానికి పారిశ్రామికం
దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. గత కొన్ని నెలలుగా భారీగా పుంజుకుంటూ వచ్చిన సూచీ సెప్టెంబర్ నెలలో సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
- సెప్టెంబర్ నెలలో 6.7 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : దేశీయ పారిశ్రామిక రంగం మళ్లీ పడకేసింది. గత కొన్ని నెలలుగా భారీగా పుంజుకుంటూ వచ్చిన సూచీ సెప్టెంబర్ నెలలో సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. తయారీ, గనుల రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా గత నెలకుగాను 6.7 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మే నెలల నమోదైన 5 శాతం తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం. నూతన సిరీస్‌లో భాగంగా విడుదలైన ఈ గణాంకాలు ఆగస్టు నెలలో 8 శాతం వృద్ధిని సాధించింది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నూతన సిరీస్‌లో గణాంకాలను విడుదల చేస్తున్నది సర్కార్. గత నెలలో తయారీ రంగ సూచీ 7.6 శాతానికి పరిమితం కాగా, విద్యుత్, గ్యాస్ రంగాలు కూడా నిరాశపరిచాయి. వీటితోపాటు గ్యాస్ సరఫరా, వాటర్ సైప్లె, వేస్ట్ మేనేజ్మెంట్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పారిశ్రామిక వృద్ధిలో 76 శాతం వాటా కలిగిన తయారీ రంగం నిరాశాజనక పనితీరు కనబర్చడంతో మొత్తం గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపాయని పేర్కొంది. ఎలక్ట్రికల్ పరికరాల్లో 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, మోటర్ వాహనాలు, ట్రైలర్లు 19 శాతం, రబ్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తుల 19.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

