Farex Reserves | భారత్ ఫారెక్స్ మార్కెట్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి పడిపోయాయి. ఈ నెల 11తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 9.646 బిలియన్ డాలర్లు తగ్గి 622.275 బిలియన్ల డాలర్లకు తగ్గిపోయాయి. ఇది దాదాపు రెండేండ్ల కనిష్టానికి సమానం. 2020లో మార్చి 20తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 11.108 (11.9 బిలియన్ల) బిలియన్ల డాలర్లు కోల్పోయి 554.359 బిలియన్ల డాలర్లకు పరిమితం అయ్యాయి.
ఈ నెల ఏడో తేదీన ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో పతనం కావడం వల్లే విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయాయి. ఈ నెల ఏడో తేదీన డాలర్‌పై రూపాయి విలువ 77.02కి పతనమైంది. దీంతో ఆర్బీఐ మధ్యలో జోక్యం చేసుకుని 100 కోట్ల డాలర్లను మార్కెట్లో ప్రవేశపెట్టి,రూపాయి విలువ పతనం కాకుండా నిలువరించింది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యతో ముడి చమురు ధరలు పెరిగి, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి నిధులు ఉపసంహరించడంతో రూపాయి మారకం విలువ ఆల్‌టైం రికార్డు పతనమైంది. గతేడాది సెప్టెంబర్ మూడో తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 642.453 బిలియన్ల డాలర్లకు పెరిగాయి. ఇటీవలి కాలంలో ఇదే గరిష్టం.