Vivo Y200e 5G | ప్రముఖ చైనా టెక్ కంపెనీ వివో భారత్ మార్కెట్లో తన వివో వై200ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. బ్యాక్ ప్యానెల్‌పై ఎకోఫైబర్ లెదర్ ఫినిష్ విత్ యాంటీ స్టెయిన్ కోటింగ్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. ఐపీ5ఎక్స్ డస్ట్ రెసిస్టెన్స్, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తున్న ఈ ఫోన్ స్టెయిన్, స్క్రాచ్, డెయిలీ యూవీ ఏజింగ్, వేర్ రెసిస్టెన్స్, డెయిలీ స్వీట్ కొరోషన్ రెసిస్టెన్స్ కెపాసిటీ కలిగి ఉంటుంది. వివో వై200 5జీ అప్డేటెడ్ వర్షన్‌గా వివో వై200ఈ 5జీ ఫోన్ వస్తున్నది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ తో గత అక్టోబర్‌లో వివో వై200 5జీ ఫోన్ ఆవిష్కరించారు. ఇప్పుడు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తోంది వివో వై200ఈ 5జీ. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది.
వివో వై200ఈ 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు అందుబాటులో ఉంటుంది. బ్లాక్ డైమండ్, సాఫ్రాన్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. వివో ఇండియా, ఈ-కామర్స్ వెబ్ సైట్, ఆఫ్ లైన్ స్టోర్లలో ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. వివో వై200ఈ 5జీ ఫోన్ 6.67 అంగుళాల ఆల్ట్రా విజన్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఫుల్ హెచ్ డీ + రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ స్పీకర్లు కలిగి ఉంటుంది.
ఎల్ఈడీ ఫ్లాష్ లైట్‌తోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నదీ వివో వై200ఈ 5జీ ఫోన్. 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగా పిక్సెల్ బొకెహ్ లెన్స్ అండ్ ఫ్లికర్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ, వీడియోకాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ -14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. 6జీబీ ర్యామ్ విత్ గల వేరియంట్ ఫోన్ లో వర్చువల్ గా మరో 8 జీబీ ర్యామ్ లభిస్తుంది. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు. 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. డ్యుయల్ సిమ్ 5జీ, వై-ఫై 802ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.