జోరందుకున్న ఎగుమతులు

- మే నెలలో 67 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ఏకంగా 67 శాతం వృద్ధిని సాధించాయి. 32.21 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇంజినీరింగ్, పెట్రోలియం, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ అత్యధికంగా ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 19.24 బిలియన్ డాలర్ల ఎగుమతి జరిగింది. ఇదే నెలలో 38.53 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు 6.32 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
గత నెలలో 9.45 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి అయింది. మే 2020 నెలలో అయిన 3.57 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది.
ఏప్రిల్-మే రెండు నెలల్లో ఎగుమతులు 62.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 84.25 బిలియన్ డాలర్లు దిగుమతులు జరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

