Car Sales | ఎస్యూవీ కార్లపై పెరుగుతున్న మోజు.. 2023 కార్ల సేల్స్‌లో సగం ఆ సంస్థ మోడల్సే..!
Car Sales | 2022తో పోలిస్తే గతేడాది కార్ల సేల్స్ 8.3 శాతం పెరిగాయి. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 48.7 శాతంగా నమోదైంది.
Car Sales | దేశీయంగా కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. 2022తో పోలిస్తే 2023లో కార్ల విక్రయాల్లో 8.3 శాతానికి పైగా గ్రోత్ నమోదైంది. గతంతో పోలిస్తే బుల్లి కార్ల కంటే ఎస్యూవీ కార్లకు గిరాకీ ఎక్కువవుతున్నది. 2022తో పోలిస్తే 2023లో 41.08 లక్షల కార్ల సేల్స్ నమోదయ్యాయి. 2022లో సరాసరి కారు ధర రూ.10.58 లక్షలు పలికితే 2023లో రూ.11.5 లక్షలకు పెరిగింది. 2019లో సగటున ఒక కారు ధర రూ.8.2 లక్షలుగా నిలిచింది. రోజురోజుకి బుల్లి కార్లు, ఎస్యూవీ కార్ల విక్రయాలకు తేడా పెరుగుతున్నది. మొత్తం కార్ల అమ్మకాల్లో దాదాపు సగ భాగం మారుతి సుజుకి మోడల్ కార్లే ఉన్నాయి. తర్వాతీ స్థానాల్లో హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ బెస్ట్‌గా నిలిచాయి.
దేశీయ మార్కెట్లో ఒక ఏడాదిలో కార్ల విక్రయాలు 41.08 లక్షల మార్కును దాటడం ఇదే ఫస్ట్ టైం అని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. 2022లో 37.30 లక్షల కార్లు అమ్ముడు పోయాయి. అయితే 2023లో రిటైల్ కార్ల విక్రయాలు 40.51 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
మొత్తం కార్ల సేల్స్‌లో ఎస్‌యూవీల వాటా 26 శాతం పెరిగిందన్నారు మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ. 2022లో ఎస్యూవీ కార్ల సేల్స్ మొత్తం కార్ల విక్రయాల్లో 42 శాతం నమోదైతే 2023లో 48.7 శాతానికి దూసుకెళ్లింది. హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ 34.8 నుంచి 30 శాతానికి, సెడాన్ మోడల్ కార్లు 11 నుంచి 9.4 శాతానికి పడిపోయాయి. ఇక మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్స్ 8.7 శాతం వద్దే నిలిచిపోయాయి.
గతేడాది కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి మరో రికార్డు నమోదు చేసింది. 2023లో 20 లక్షల కార్లు విక్రయించిన మారుతి ఈ రికార్డు సాధించడం ఇదే తొలిసారి. గ్రామాల్లో 7.76 లక్షలు అమ్ముడైతే, 2,69,046 కార్లు విదేశాలకు ఎగుమతయ్యాయి. హ్యుండాయ్ గతేడాది కార్ల సేల్స్‌లో తొమ్మిదిశాతం గ్రోత్ సాధించింది. 2022లో 7,00,811 కార్లు అమ్ముడైతే 2023లో 7,65,786 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటార్స్ దాదాపు 5.53 లక్షల యూనిట్ల కార్లు విక్రయిస్తే కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో తనదైన ముద్ర వేసింది. మిగతా కార్లలో హ్యాచ్ బ్యాక్‌ల విక్రయాలు పడిపోతుంటే టాటా మోటార్స్ పెంచుకున్నదని సంస్థ ఎండీ శైలేష్ చంద్ర చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

