IMP- Indian Economy | అంతర్జాతీయంగా స్థిరంగా అభివృద్ధి కొనసాగుతున్నా 2024-25లో భారత వృద్ధిరేటు స్వల్పంగా బలహీన పడవచ్చునని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. అమెరికా వాణిజ్య విధానం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయంగా విభేదాలు ఉన్నా, గ్లోబల్ వృద్ధిరేటు నికరంగా ఉంటుదన్నారు. భారత వృద్ధిరేటు బలహీన పడటానికి కారణాలేమీ చెప్పలేదు. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకానమీ ఔట్లుక్ ప్రకారం అమెరికా వృద్ధిరేటు అంచనాలకన్నా మెరుగ్గా ఉంటుందని చెప్పారు. ఈయూ అభివృద్ధి నిలిచిపోతుందన్నారు.
బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై అధిక ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రెండో ఆర్థిక వ్యవస్థ చైనాలో ప్రతికూల ద్రవ్యోల్బణం నెలకొందన్నారు. దేశీయంగా డిమాండ్లకు సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. అన్ని రకాల చర్యలు తీసుకున్నా తక్కువ ఆదాయ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసే సుంకాలు, పన్నులు, నియంత్రణ నిబంధనలను అమల్లోకి తెచ్చినా ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు.
ఈ నెల 2౦న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ద్రవ్యోల్బణంపై పోరుకు వడ్డీరేట్లు పెంచక తప్పదని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, చైనా, కెనడాలపై అదనపు సుంకాలు, పన్నులు ఉంటాయని హెచ్చరించారు.