Tesla – Import Duty | టెస్లా కార్లపై సుంకం తగ్గింపు.. ససేమిరా అంటున్న టాటా.. మహీంద్రా. .అదే బాటలో ఇతర సంస్థలు
Tesla - Import Duty | టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని దేశీయ ఆటోమొబైల్ సంస్థలతోపాటు జపాన్, దక్షిణ కొరియా సంస్థలు భావిస్తున్నాయి.
Tesla – Import Duty | ఎలన్ మస్క్ సారధ్యంలోని హై ఎండ్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్లోకి అనుమతించేందుకు దిగుమతి సుంకంలో రాయితీలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై దేశీయ ఆటోమొబైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ జాబితాలో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు ఉన్నాయి. దిగుమతి సుంకం తగ్గింపుతోపాటు పలు ఆప్షన్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా కార్ల మార్కెట్లో వాటాదారులుగా ఉన్న అన్ని సంస్థలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దిగుమతి సుంకం తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెబుతున్నట్లు సమాచారం.
కొంత కాలం మాత్రమే టెస్లా కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై విధాన నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి చెప్పారు. టెస్లా కార్లపై 15 శాతం దిగుమతి సుంకం తగ్గించాలన్న ప్రతిపాదన కేంద్రం ముందు ఉన్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి.
సుదీర్ఘ కాలంగా దిగుమతి సుంకాలు తగ్గించాలని టెస్లా కోరుతున్నది. అలాగైతేనే భారత్ మార్కెట్లో చౌకగా విద్యుత్ కార్ల తయారీ సాధ్యం అవుతుందని, విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చునని వాదిస్తోంది. కానీ టెస్లా వాదనను టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తిప్పి కొడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై గణనీయ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో తమ కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతుందని ఈ సంస్థలు చెబుతున్నాయి.
దేశీయంగా ఇంతకుముందు పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి.. తాజా దిగుమతి సుంకం తగ్గింపు ప్రతిపాదన వ్యతిరేకం అని టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తేల్చి చెప్పాయి. ఇప్పటికే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సియేటివ్ (పీఎల్ఐ) కింద కార్ల తయారీకి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నాయి.
జపాన్ కార్ల తయారీ కంపెనీలు ఇప్పటికీ భారత్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించలేదు. కానీ, తమ భవిష్యత్ హైబ్రీడ్ కార్ల మార్కెట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టెస్లా కార్లపై దిగుమతి సుంకం తగ్గింపు విషయమై అన్ని కార్ల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రతినిధులు చెబుతున్నారు. కంపెనీల అభిప్రాయాలను ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్తామని సియామ్ ప్రతినిధులు చెప్పారు.
బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్, ఫోక్స్ వ్యాగన్ గ్రూప్ సంస్థలు ఆచితూచీ స్పందిస్తున్నాయి. తమ వైఖరికి భిన్నంగా టెస్లా కార్లపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. ఆయా కంపెనీల్లో భారత్, జపాన్, దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థలు ఉన్నాయి. టెస్లా కార్లపై దిగుమతి సుంకాల తగ్గింపుపై ప్రభుత్వ అధికార వర్గాల్లోనే పూర్తి స్థాయిలో అంగీకారం లేదని సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

