ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 25, 2020 , 00:39:26

తాత్కాలికమే ఆర్థిక మందగమనంపై ఐఎంఎఫ్‌

తాత్కాలికమే ఆర్థిక మందగమనంపై ఐఎంఎఫ్‌

దావోస్‌, జనవరి 24: దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితులు తాత్కాలికంగానే కనిపిస్తున్నాయని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా అన్నారు. త్వరలోనే జీడీపీ కోలుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్‌లో తమ ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం నివేదిక నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పటి ప్రపంచ పరిస్థితులు కొంత మెరుగయ్యాయని ఇక్కడ జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాల్లో పాల్గొన్న జార్జీవా శుక్రవారం అభిప్రాయపడ్డారు. అమెరికా-చైనా మధ్య తగ్గుముఖం పట్టిన వాణిజ్య యుద్ధం ఇందుకు దోహదపడిందన్నారు. కాగా, రాబోయే బడ్జెట్‌లో వృద్ధిరేటుకు ఊతమిచ్చేలా నిర్మాణాత్మక సంస్కరణలుండాలని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ముంబైలో అన్నారు. 
logo