కృత్రిమ మేధపై సుందర్ పిచ్చాయ్ ఏం చెప్పారంటే..?!
కృత్రిమ మేధపై సుందర్ పిచ్చాయ్ ఏం చెప్పారంటే..?! | వచ్చే 25 ఏండ్ల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ...

లండన్: వచ్చే 25 ఏండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో సాధించే ప్రగతి యావత్ ప్రపంచాన్నే విప్లవాత్మకంగా మార్చి వేస్తుందని గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ చెప్పారు. ఇవి మానవాళి అభివృద్ధి చేసిన అత్యంత గొప్ప సాంకేతిక విప్లవాలుగా ఉండబోతాయని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్.. మానవ జీవితాన్ని కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అగ్ని, విద్యుత్, ఇంటర్నెట్ మాదిరిగానే భవిష్యత్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే అత్యవసరం అవుతుందన్నారు.
కృత్రిమ మేధ సాయంతో కొన్ని పనులను మనుష్యుల కంటే సమర్ధవంతంగా చేయొచ్చునని సుందర్ పిచ్చాయ్ అన్నారు. ఫిజికల్ కార్యక్రమాలకంటే ఆన్లైన్ కార్యక్రమాలే ఊపందుకున్నాయని చెప్పారు. ఇప్పుడంతా డిజిటల్ యుగం అని వ్యాఖ్యానించారు.
ఇటీవల కొన్ని దేశాల్లో ఉచిత, అనియంత్రిత ఇంటర్నెట్ వాడకం ఇబ్బందుల్లో పడిందని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చాలా దేశాలు సమాచార ప్రవాహాన్ని నియంత్రిస్తున్నా యన్నారు. చైనాలో మేజర్ ప్రొడక్ట్స్ గూగుల్ ఏవీ అందుబాటులో లేవని తెలిపారు.
మౌలికంగా మనిషి మేధస్సును యంత్రాల్లోకి చొప్పించి, అనేక రెట్లు దాన్ని వృద్ధి చేసి, పనిచేయించడమే కృత్రిమ మేధ అని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కృత్రిమ మేధ వ్యవస్థలు మనుషుల కంటే మిన్నగా అనేక సమస్యలను పరిష్కరిస్తున్నాయని గుర్తు చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

