HomeBusinessIndia Forex Reserves 20 Billion Dollars Down
Forex Reserves | పడిపోతున్న ఫారెక్స్ నిల్వలు.. నెల రోజుల్లో 20 బిలియన్ డాలర్లు ఔట్
దేశంలోని ఫారెక్స్ రిజర్వులు అంతకంతకూ కరిగిపోతున్నాయి. అక్టోబర్ 25తో ముగిసిన వారంలోనూ మరో 3.4 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో దాదాపు గత నెల రోజుల్లో చోటుచేసుకున్న వరుస పతనాల్లో విదేశీ మారకపు నిల్వలు ఏకంగా 20 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయినైట్టెంది.
Forex Reserves | న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశంలోని ఫారెక్స్ రిజర్వులు అంతకంతకూ కరిగిపోతున్నాయి. అక్టోబర్ 25తో ముగిసిన వారంలోనూ మరో 3.4 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో దాదాపు గత నెల రోజుల్లో చోటుచేసుకున్న వరుస పతనాల్లో విదేశీ మారకపు నిల్వలు ఏకంగా 20 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయినైట్టెంది. సెప్టెంబర్ 27న 704.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, గత నెల 25 నాటికి 684.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలియజేసింది.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 25దాకా ప్రతీ వారం 3.7, 10.7, 2.2, 3.4 బిలియన్ డాలర్ల చొప్పున క్షీణించాయి. ఇక భారతీయ ఫారెక్స్ నిల్వల్లో అత్యధిక శాతం ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఇవి గత నెల 25 నాటికి 593.75 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వారం రోజుల్లో 4.48 బిలియన్ డాలర్లు తగ్గిపోవడం గమనార్హం. అలాగే బంగారం నిల్వలు 1 బిలియన్ డాలర్ల మేర పెరిగి 68.5 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 18.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు ఫారెక్స్ రిజర్వుల్లో భారత్ ప్రపంచంలోనే నాల్గో స్థానంలో ఉన్నది. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత దేశంలోని విదేశీ మారకపు నిల్వలే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.