Godl Import Price | బంగారం, వెండితోపాటు వంట నూనెలైన పామాయిల్, సోయాబీన్ ఆయిల్ ధరలు తగ్గనున్నాయి. వీటిపై బేస్ దిగుమతి ధరలు తగ్గిస్తూ కేంద్రం బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. క్రూడ్ పామాయిల్, సోయాబీన్ ఆయిల్, బంగారం, వెండిలపై ప్రతి 15 రోజులకోసారి బేస్ దిగుమతి ధరలు కేంద్రం సవరిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్. దేశీయ అవసరాల కోసం 20 లక్షల టన్నుల సోయాబీన్ ఆయిల్‌ను దిగుమతి సుంకం లేకుండా గత నెలలో కేంద్రం అనుమతించింది. బంగారం, వెండి మినహా అన్ని కమోడిటీల బేస్ ధర టన్నులపై లెక్కిస్తారు. బంగారంపై 10 గ్రాములకు, వెండిపై కిలో ప్రకారం లెక్కిస్తారు.
కమోడిటీ ———————– నూతన ధర (డాలర్లు) ————- పాత ధర (డాలర్లు)
క్రూడ్ పామాయిల్ ———————- 1,620 —————– 1,625
ఆర్బీడీ పామాయిల్ ——————– 1,757 —————— 1,733
ఆర్బీడీ పామోలిన్ ——————— 1,767 ——————- 1,744
క్రూడ్ సోయాబిన్ ఆయిల్ ———– 1,831 ——————– 1,866
బంగారం —————————- 585 ———————– 597
వెండి ——————————– 695 ———————- 721