ముంబై, మే 27:ఫారెక్స్ రిజర్వులు పెరిగాయి. ఈ నెల 20తో ముగిసిన వారాంతానికిగాను విదేశీ మారకం నిల్వలు 4.23 బిలియన్ డాలర్లు పెరిగి 597.509 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లనే అధికమయ్యాయని పేర్కొంది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.825 డాలర్లు ఎగబాకి 533.378 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అలాగే పసిడి రిజర్వులు 253 మిలియన్ డాలర్లు పెరిగి 40.823 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్ద ఉన్న నిధులు 102 మిలియన్ డాలర్లు అధికమై 18.306 బిలియన్ డాలర్లకు చేరాయి.