న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీ) వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. రూ.2 కోట్లలోపు ఉన్న, 1,2 సంవత్సరాల కాలపరిమితిగల ఎఫ్డీలపై 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లు పెంచుతూ బ్యాంక్ వెబ్సైట్లో పోస్ట్ చేసింది. వీటిపై ఇప్పటివరకూ 5 శాతం రేటును ఆఫర్ చేస్తుండగా, దీనిని 5.10 శాతానికి చేర్చింది.