రెండంకెల వృద్థి దిశగా భారత్ : ఐఎంఎఫ్

న్యూఢిల్లీ : గత ఏడాది కొవిడ్-19తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది భారీగా పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2021లో భారత్ 11.5 శాతంతో దూసుకెళ్లి రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని పేర్కొంది. కరోనా వైరస్ సవాళ్లు మిగిలిఉన్నా ప్రపంచంలోనే రెండంకెల వృద్ధి రేటును సాధించే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా 2021లో భారత్ ఎదుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఐఎంఎఫ్ మంగళవారం వెల్లడించిన తాజా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో ఈ గణాంకాలను వెల్లడించింది.
కరోనా మహమ్మారితో 2020లో భారత ఎకానమీ 8 శాతం తగ్గుదల నమోదు చేస్తుందని పేర్కొంది. ఇక చైనా 2021లో 8.1 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ఆ తర్వాతి స్ధానాల్లో స్పెయిన్ (5.9), ఫ్రాన్స్ (5.5) వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో నిలుస్తాయని పేర్కొంది. ఇక 2022లో భారత్ 6.8 శాతం, చైనా 5.6 శాతం వృద్ధి రేటు సాధిస్తాయని ఐఎంఎఫ్ పేర్కొంది. ఇక కరోనా వైరస్ కట్టడిలో భారత్ నిర్ణయాత్మక చర్యలు చేపట్టిందని, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం లేకుండా సమయానుకూలంగా వ్యవహరించిందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ఇటీవల వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం