e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home బిజినెస్ 16 నుంచి హైదరాబాద్‌లో ఐజీడీసీ

16 నుంచి హైదరాబాద్‌లో ఐజీడీసీ

  • రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18: హైదరాబాద్‌ నగరం మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. వచ్చే నెల 16 నుంచి 18 వరకు ఇండియా గేమ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌(ఐజీడీసీ) జరుగబోతున్నది. కరోనా దృష్ట్యా ఈసారి కూడా వర్చ్యువల్‌గా జరుగుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగనున్నది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో టెక్నాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, నైపుణ్యాల పెంపు, నెట్‌వర్కింగ్‌ విభాగాల్లో ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ బృహత్‌ కార్యక్రమంలో సుమారు 10 వేల మంది పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వార్షిక ఐజీడీసీ అవార్డులు ఇవ్వనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement