హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో-2024ను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రదర్శన ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజులపాటు హైటెక్స్‌లో జరగనున్నదని నిర్వాహకులు తెలిపారు. సుమారు 70కిపైగా గ్రీన్ సర్టిఫైడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రదర్శించనున్నాయి.