ఇలా చేస్తే సొంతంగా ఇంటి నిర్మాణానికి లోన్ ఈజీ
Home Construction Loan | సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకు రుణం కావాలంటే, ఇన్‌కం, ఈఎంఐ పేమెంట్ సామర్థ్యం, సిబిల్ స్కోర్ కీలకం.
Home Construction Loan | మీ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంక్ రుణం కావాలా..? తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో గానీ.. సొంతంగా కొనుగోలు చేసిన స్థలంలో గానీ ఇల్లు నిర్మించుకోవాలని కొందరు తహతహలాడుతుంటారు. అందుకు అవసరమైన రుణాల కోసం ఎలా సంప్రదించాలన్న డౌట్స్ తలెత్తుతాయి. ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయిన ఇల్లు, నిర్మాణంలో ఉన్న ఇంటిని ఒక రియాల్టీ డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే బ్యాంకులు రుణాలిస్తాయి. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి కూడా బ్యాంకులు రుణాలిస్తాయి.
80 శాతం వరకు లోన్
సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలని తలపోసే వారికి.. ఇంటి నిర్మాణ రుణం ఇస్తాయి. ఇదీ ఒక రకంగా హోంలోనే. మీ స్థలం విలువలో 80 శాతం వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత రుణం మంజూరైనా.. ఒకేసారి బ్యాంకులు ఈ రుణం ఇవ్వవు. దశల వారీగా పని పురోగతిని బట్టి లోన్ అమౌంట్ మీ ఖాతాలో జమ చేస్తుంటాయి బ్యాంకులు. సొంతింటిని నిర్మించుకునే వారు బ్యాంకు లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆ ఇంటి నిర్మాణ ప్రణాళికకు సంబంధించి పూర్తి షెడ్యూల్ సదరు బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది.
సొంతింటి నిర్మాణ రుణాలిలా
మీ పేరు మీద గల సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం సెల్ఫ్ కన్స్ట్రక్షన్ లోన్ తీసుకోవచ్చు. ఒక్కోసారి సొంత స్థలం కొనుగోలుతోపాటు ఇంటి నిర్మాణానికి రుణం తీసుకోవచ్చు. కేవలం స్థలం కొనుగోలు చేయడానికి హోంలోన్ క్యాటగిరీలో బ్యాంకులు రుణాలివ్వవు. అసెట్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్నే ప్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ లోన్ అంటారు. ఇప్పటికే ఉన్న ఇంటి విస్తరణకు కూడా లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉంటున్న ఇంటిపై మరో అంతస్తు నిర్మించాలనుకుంటే ఎక్స్టెన్షన్ లోన్ పొందొచ్చు. ఇంట్లో రిపేర్లు, పెయింటింగ్ తదితర అధిక ఖర్చు గల పనులు చేయాలనుకుంటే రెన్యూవల్ (పునరుద్ధరణ) లోన్ తీసుకోవచ్చు. దీన్ని ఎక్స్టెన్షన్ లోన్ అంటారు.
క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అప్రూవల్
మీరు ఇంటి లోన్ కోసం దరఖాస్తు చేస్తే.. ఆ అప్లికేషన్ అప్రూవల్ కావడంలో మీ క్రెడిట్ స్కోర్ కీలకం అవుతుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ గ్రహీత గత చెల్లింపుల రికార్డు బాగుందని, ఎటువంటి రుణ ఎగవేతలకు పాల్పడలేదని అర్థం అవుతుంది. గడువులోగా నెలసరి వాయిదాలు చెల్లిస్తారని బ్యాంకులు విశ్వసిస్తాయి. త్వరితగతిన రుణ దరఖాస్తుకు ఆమోదం తెలుపుతాయి. మీ రుణ అర్హతలను బ్యాంకులు.. మీ ఇన్‌కం, పేమెంట్ కెపాసిటీ ఆధారంగా లెక్కిస్తాయి. ఇప్పటికే ఏదేనీ రుణానికి ఈఎంఐలు కడుతున్నట్లయితే, దాంతోపాటు కొత్తగా తీసుకునే ఇంటి రుణం ఈఎంఐ కలిపితే మీ ఆదాయంలో 50 శాతం మించకూడదు. అటువంటప్పుడే రుణ దరఖాస్తు అప్రూవల్ అవుతుంది.
అర్హతలు, ఈఎంఐలపై చెక్ చేసుకోవాలి
రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందే మీ అర్హతలు, చెల్లించాల్సిన ఈఎంఐలను గురించి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా వరకు హోంలోన్ క్యాలిక్యులేటర్లు ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులూ తమ వెబ్సైట్లలో అందిస్తున్న క్యాలిక్యులేటర్లను వాడుకోవచ్చు. బ్యాంకు రుణం తొందరగా మంజూరు కావాలంటే.. ఇల్లు కట్టే స్థలంపై ఎటువంటి లీగల్ సమస్యలు ఉండొద్దు. ఇల్లు నిర్మించే విస్తీర్ణం ఎంత, నిర్మాణానికి ఉన్న వనరులేంటి, నిర్మాణ కాంట్రాక్టర్, ప్రభుత్వ పర్మిషన్లు ఉన్నాయా? అన్న అన్ని విషయాలు బ్యాంకులు చెక్ చేసి ధృవీకరించుకున్నాకే లోన్ త్వరగా లభిస్తుంది.
ఇంటి నిర్మాణంలో జాగ్రత్తలు
ఇంటిని నిర్మించ తలపెట్టినప్పుడు ప్రొఫెషనల్ కాంట్రాక్టర్‌ను సంప్రదిస్తే బెటర్. గతంలో మంచిగా ఇండ్ల నిర్మాణ చరిత్ర గల వారైతే బ్యాంకులు త్వరగా రుణ దరఖాస్తు అప్రూవ్ చేసే చాన్స్‌లు ఉంటాయి. ఇంటి నిర్మాణం మొదలైన తర్వాత స్టీల్, సిమెంట్, ఇటుక, ఇసుక ధరలు పెరిగి ఖర్చు ఎక్కువయ్యే చాన్స్ ఉంటుంది. ఈ ఖర్చులు అధిగమించేందుకు సరిపడా సొమ్ము ఆదా చేసి ఉంచామని బ్యాంకులకు హామీ ఇవ్వాలి. సొంతంగా ఇంటి నిర్మాణం చేపడితే మీ చేతిలోనే ప్లానింగ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఇంజినీర్ సలహాతో మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఇల్లు కట్టుకోవచ్చు. ఒక బిల్డర్ వద్ద ఇల్లు కొంటే ఆ అవకాశం ఉండదు. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ మీరే స్వయంగా ఎంచుకుంటారు కనుక నాణ్యతపై రాజీ పడే చాన్స్ ఉండదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

