లైఫ్ సైన్సెస్ ఆర్ అండ్ డీలో హైదరాబాద్ హవా

- ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం
- అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన ప్రాంతం
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో 27 ప్రాజెక్టులు
- తాజా నివేదికలో ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు భారతీయ నగరాలు ప్రపంచంలోనే అత్యంత కీలకంగా మారాయి. వీటిలో హైదరాబాద్ ప్రపంచ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో ఉన్నట్టు అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్’ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్‌లో నోయిడా అగ్రస్థానంలో నిలిచిందని, హైదరాబాద్ తర్వాత 3 నుంచి 6 స్థానాల్లో వరుసగా చెన్నై, గుర్గావ్, పుణే, బెంగళూరు ఉన్నాయని తాజా నివేదికలో పేర్కొన్నది. కొవిడ్ వ్యాప్తితో వైద్యారోగ్య రంగంలో ఆర్అండ్డీ కార్యకలాపాలు కీలకంగా మారాయి. ఈ రంగంలో పెట్టుబడులకు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు కంటే హైదరాబాద్ అత్యంత అనుకూలంగా ఉన్నదని, అందుకే పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. లైఫ్ సైన్సెస్ రంగంలో ఎఫ్‌డీఐలతో 27 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆర్అండ్డీ ల్యాబ్‌ల నిర్వహణ ఎంతో వ్యయభరితమైనది. ఈ నేపథ్యంలో తక్కువ నిర్వహణ వ్యయంతో నాణ్యమైన, ఖచ్చితత్వంతో కూడిన ఫలితాలను రాబట్టేందుకు భారతీయ నగరాలు ప్రపంచంలోని ఇతర నగరాల్లో పోటీపడుతున్నాయి.
పెట్టుబడులకు నగరం అనుకూలం
ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా లైఫ్ సైన్సెస్ రంగంలోనూ హైదరాబాద్ సత్తా చాటుతున్నది. పరిశోధనలకు అనువైన వాతావరణం, నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఎఫ్‌డీఐ బెంచ్‌మార్క్ నివేదిక స్పష్టం చేసింది. 50 మంది పరిశోధకుల బృందంతో 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్అండ్డీ ల్యాబ్‌ను నిర్వహించేందుకు ఏ నగరంలో ఎంత ఖర్చవుతుందనే అంశాన్ని ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకొన్నారు. ఏడాదికి హైదరాబాద్‌లో 9,02,568 డాలర్లు, నోయిడాలో 8,30,654 డాలర్లు ఖర్చవుతున్నట్టు తేల్చారు. మిగతా నగరాల్లో 10 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా వ్యయం అవుతున్నట్లు లెక్కగట్టారు. వీటితో పోలిస్తే హైదరాబాద్, నోయిడాలో ఆర్అండ్డీ ల్యాబ్‌లను చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చని గుర్తించారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- FDIs
- Hyderabad
- life sciences
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

