హైదరాబాద్, జనవరి 20: ఆఫీస్ స్థలాల నిర్వహణ సంస్థ ఐస్ప్రౌట్..హైదరాబాద్‌లో మరో ఆఫీస్‌ను లీజుకు తీసుకున్నది. హైటెక్ సిటీలోని అర ఆర్బిట్ సెంటర్లో 2.50 లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్తగా కార్యాలయాన్ని తీర్చిదిద్దింది. 4 వేల మంది కూర్చోవడానికి వీలుండే విధంగా నాలుగు అంతస్తుల భవనంలో ఈ ఆఫీస్ స్థలాన్ని కార్పొరేట్ సంస్థలకు నచ్చే విధంగా డిజైన్ చేసినట్టు కంపెనీ సీఈవో సుందరి పాటిబండ్ల తెలిపారు.
దీంతో దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న సెంటర్ల సంఖ్య 17కి చేరుకున్నట్లు చెప్పారు. 2017లో తన తొలి సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నూతన సెంటర్ అందుబాటులోకి రావడంతో అదనంగా 2.50 లక్షల చదరపు అడుగుల చేరినట్లు అయినట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో 10, చెన్నైలో రెండు, బెంగళూరులో రెండు, పుణెలో రెండు, విజయవాడలో సెంటర్లను నెలకొల్పింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది చివరినాటికి ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లకు విస్తరించాలనుకుంటున్నట్లు