ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటర్ ఇండియా తన బియాండ్ మొబిలిటీ ప్రచార పర్వంలో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ‘నమస్తే’ బ్రాండ్‌ను అమర్చింది. 30 అడుగుల ఈ నిర్మాణంలో ఆధునిక సాంకేతికతకు సూచనగా ఒక రొబోటిక్ చేయి,మానవీయతకు రూపంగా ఒక మనిషి చేయిని కలుపుతూ దీనిని రూపొందించారు. భవిష్యత్తులో మనిషి, మెషిన్ కలిసి పనిచేస్తారన్న తమ విజన్‌ను ఇది ప్రదర్శిస్తున్నదని హ్యుందాయ్ తెలిపింది.