Hyundai Alcazar New | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా గురువారం దేశీయ విపణిలో తన అల్కాజర్ ఎస్యూవీ న్యూ బేస్ మోడల్ కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.15.89 లక్షల నుంచి మొదలవుతుంది. న్యూ ప్రిస్టీజ్ వేరియంట్ మోడల్ కారు.. ఇంతకుముందు మోడల్ కంటే రూ.55 వేలు తక్కువకే లభిస్తుంది. హ్యుండాయ్ అల్కాజర్ ప్రిస్ట్రేజ్.. ఆరు వేరియంట్లలో మార్కెట్లోకి రాబోతున్నది. ప్రిస్టిజ్, ప్రిస్టీజ్ (ఓ), ప్లాటినం, ప్లాటినం (ఓ), సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ) వేరియంట్లలో వస్తున్నది. పెట్రోల్ ఎంటీ (7-సీటర్) రూ.15,89,400, డీజిల్ ఎంటీ (6 అండ్ సెవెన్ సీటర్) రూ.16,30,300, డీజిల్ ఏటీ (సెవెన్ సీటర్) రూ.17,77,300లకు లభ్యం అవుతుంది.
న్యూ మోడల్ అల్కాజర్ కారు ఆపిల్ కారుప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీతోపాటు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేతో వస్తుంది. ఇంతకుముందు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండేది. న్యూ ప్రిస్టిజ్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ వన్ మిక్, ప్రిస్టిజ్ వేరియంట్ 2 మిక్స్‌తో వస్తున్నది. ఫోర్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, 2 ట్వీటర్స్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు న్యూ ప్రిస్టిజ్ ఎగ్జిక్యూటివ్ బేస్ వేరియంట్లో లభించనున్నాయి.
అల్కాజర్ న్యూ ప్రిస్టిజ్ వేరియంట్ కారు 2.0 లీటర్ల ఎంపీఐ ఇంజిన్, 6500 ఆర్పీఎం వద్ద 158 బీహెచ్పీ, 4500 ఆర్పీఎం వద్ద 191 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుందిన సిక్స్ స్పీడ్ మాన్యువల్, సిక్స్ స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. 1.5 లీటర్ల టర్బో డీజిల్ సీఆర్డీఐ ఇంజిన్ 4000 ఆర్పీఎం వద్ద 113 బీహచ్పీ, 1500 ఆర్పీఎం వద్ద 250 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ సిక్స్ స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆఫర్ కూడా లభిస్తుంది.