Hyundai – Unsoo Kim | హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) మేనేజింగ్ డైరెక్టర్‌గా యున్‌సూ కిమ్ (Unsoo Kim) తిరిగి నియమితులయ్యారు. 2025 జనవరి 25 నుంచి మూడేండ్ల పాటు యున్‌సూ కిమ్ ఈ పదవిలో కొనసాగుతారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. దక్షిణ కొరియాలోని హ్యుండాయ్ మోటార్ కంపెనీలో 1991లో కిమ్ జాయిన్ అయ్యారు. 2022 నుంచి ఆయన హ్యుండాయ్ మోటార్ ఇండియాతో కలిసి పని చేస్తున్నారు. అంతకు ముందు హ్యుండాయ్ మోటార్ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.