Hyundai offers | కరోనా మహమ్మారి తర్వాత గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు రెండోదశ బీఎస్-6 ప్రమాణాలు అమలు చేయడంతోపాటు ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో ఆయా కార్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కార్ల ప్రేమికులను ఆకర్షించడానికి వివిధ కార్ల తయారీ సంస్థలు పలు రకాల డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఆ జాబితాలో దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా కూడా నిలిచింది. కస్టమర్లకు భారీగా బెనిఫిట్లు అందిస్తున్నది.
ఈ ఆఫర్లు ఐ-20, ఐ-20 ఎన్ లైన్, గ్రాండ్ ఐ-10 నియోస్, ఔరా, అల్కాజర్, కోనా ఎలక్ట్రిక్ వంటి మోడల్ కార్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. క్యాష్ డిస్కౌంట్లతోపాటు ఎక్స్చేంజ్ బోనస్ తదితర ఆఫర్లు ఉన్నాయి. ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వోద్యోగులకు ఈ బెనిఫిట్లు లభిస్తాయి. కానీ, హ్యుండాయ్ తన బెస్ట్ సెల్లింగ్ కార్లు క్రెటా, వెన్యూ, వెర్నా వంటి మోడల్ కార్లను మాత్రం ఆఫర్ల నుంచి మినహాయించింది.
హ్యుండాయ్ ఐ20, ఐ20 ఎన్లైన్ కార్లపై గరిష్టంగా రూ.40 వేల వరకు బెనిఫిట్లు పొందొచ్చు. రూ.10 లక్షల్లోపు ధరల గల కార్లను కొనుక్కోవాలంటే ఐ20 లేదా ఐ20 ఎన్ లైన్ మోడల్ కార్లలో ఒకటి ఎంచుకోవచ్చు. వీటిల్లో 26.03-సీఎం హెచ్డీ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, నేవిగేషన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ హ్యాచ్ బ్యాక్ కార్లలో ఒకటైన గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కారుపై రూ.43 వేల వరకూ బెనిఫిట్లు అందిస్తున్నది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ కలిసి ఉంటాయి. ఈ కారు 1.2-లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. గ్రాండ్ ఐ10 నియోస్పై సీఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
హ్యుండాయ్ సెడాన్ మోడల్ కారు ఔరాపై రూ.33 వేల వరకు రాయితీలు లభిస్తాయి. ఈ కారులో వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, స్మార్ట్ కీ విత్ పుష్ బటన్, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ ఎస్యూవీ మోడల్ కార్లలో ఒకటైన అల్కాజర్ కొనుగోలు చేసిన వారు రూ.20 వేల వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చు. సిక్స్ సీట్లు లేదా సెవెన్ సీట్ల కెపాసిటీతోపాటు మూడు వరుసల్లోనూ హెడ్రెస్ట్ హైట్ అడ్జస్ట్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.