Hyundai- Deepika Padukone | పాపులర్ బాలీవుడ్ సినీ నటి దీపికా పదుకునే.. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా ప్రచారకర్తగా నియమితులయ్యారు. పేరొందిన సినీ నటి దీపికా పదుకునే అనుబంధంతో స్టైల్, పెర్ఫార్మెన్స్లో అసాధారణ డ్రైవింగ్ అనుభవం అందుబాటులోకి తీసుకొస్తామని హ్యుండాయ్ మోటార్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ విషయమై హ్యుండాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ స్పందిస్తూ `అద్భుతమైన ప్రతిభా పాటవాలు గల గ్లోబల్ ఇండియన్ ఐకాన్‌గా నిలిచిన దీపికా పదుకునే మా ప్రచారకర్తగా నియమితులు కావడం పట్ల మేం సంతోషిస్తున్నాం. హ్యుండాయ్ మోటార్ యంగ్ అండ్ డైనమిక్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా సినీ రంగంలో ఆమె ఆకర్షణ, కెరీర్ స్పష్టంగా ప్రభావితం చేస్తుంది. దీపికా పదుకునే ప్రభావం సిల్వర్ స్క్రీన్కు మాత్రమే పరిమితం కాదు. వైవిధ్య భరితమైన ఆడియన్స్ ప్రత్యేకించి వైబ్రంట్ యువతలో ప్రతిబింబిస్తుంది` అని పేర్కొన్నారు. దీపికా పదుకునేతో కలిసి భవిష్యత్ తరం కార్ల ప్రేమికుల వద్దకు కొత్త మోడల్ కార్లతో శరవేగంగా దూసుకెళ్లగలుగుతామని చెప్పారు.
`ఈ భాగస్వామ్యం ఇరుపక్షాలకు పరస్పరం లబ్ధి చేకూరుస్తుంది. భారత సినీ ప్రేక్షకులతో ఆమెకు గల భావోద్వేగ పూరిత అనుబంధమే హ్యుండాయ్ మోటార్ ఇండియాకు ప్రచారకర్తగా నియమితులయ్యేలా చేసింది` అని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా తెలిపింది. హ్యుండాయ్ మోటార్స్ ఇండియాతో అనుబంధంపై దీపికా పదుకునే స్పందించారు. `విలువైన మోడల్ కార్ల తయారీలో సుసంపన్న వారసత్వం గల హ్యుండాయ్ మోటార్స్‌తో అనుబంధం నాకు గౌరవం` అని దీపికా పదుకునే పేర్కొన్నారు. `ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్`తోపాటు 16 ఏండ్ల సినిమా రంగంలో 30కి పైగా సినిమాల్లో నటించారు. హ్యుండాయ్ మోటార్ లక్ష్యాల సాధనకు నిరంతరాయం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.