Creta and Alcazar Adventure | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తన పాపులర్ ఎస్‌యూవీలు క్రెటా (Creta), అల్కాజర్ (Alcazar) అడ్వెంచర్ ఎడిషన్ (Adventure Edition) కార్ల టీజర్లు రిలీజ్ చేసింది. త్వరలో భారత్ మార్కెట్లో వాటిని ఆవిష్కరించనున్నది. క్రెటా, అల్కాజర్ అడ్వెంచర్ ఎడిషన్ కార్లు రెండూ 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, క్రూయిజ్ కంట్రోల్, సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.
ఇప్పటికే క్రెటా అప్ డేట్ వర్షన్ విడుదల చేసిన హ్యుండాయ్.. తాజాగా క్రెటా అడ్వెంచర్ ఎడిషన్‌తోపాటు అల్కాజర్ స్పెషల్ ఎడిషన్ తీసుకురానుండటం ఇదే తొలిసారి. రెండు కార్లు ఖాకీ కలర్ విత్ రేంజర్ బ్లాక్ రూఫ్‌తో వస్తున్నాయి. రెండింటిపై ‘అడ్వెంచర్ ఎడిషన్’ బ్యాడ్జింగ్ ఉంటుంది.
రెండు కార్లలోనూ ప్రధాన మార్పులేమీ ఉండవు. స్వల్ప మార్పులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, న్యూ బ్లాక్ గ్రిల్లె, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఎట్ రేర్ ఉంటాయి. స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్తో క్రెటా అడ్వెంచర్ మోడల్.. రెడ్ డార్క్ అండ్ అడ్వెంచర్ టాటా సఫారీ ఎడిషన్‌తో అల్కాజర్ అడ్వెంచర్ మోడల్ తల పడనున్నాయి.
ఇంటీరియర్‌గా హ్యుండాయ్ క్రెటా అండ్ అల్కాజర్ అడ్వెంచర్ ఎడిషన్లు పూర్తిగా బ్లాక్ కలర్స్ లో వస్తాయని భావిస్తున్నారు. నైట్ ఎడిషన్ మాదిరిగా పలు ట్రిమ్స్‌ల్లో అడ్వెంచర్ ఎడిషన్ కారు అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుత మోడల్ కార్ల మాదిరిగానే క్రెటా, అల్కాజర్ అడ్వెంచర్ ఎడిషన్ కార్లు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లతో వస్తున్నాయి. 1.5-లీటర్ల డీజిల్ ఇంజిన్ 116 హెచ్‌పీ విద్యుత్, 250 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో వస్తున్నాయి.
క్రెటా అడ్వెంచర్ ఎడిషన్‌లో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 115 హెచ్‌పీ విద్యుత్, 144 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
అల్కాజర్ అడ్వెంచర్ ఎడిషన్ కారు ఇంజిన్ 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 160 హెచ్‌పీ విద్యుత్, 253 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం హ్యుండాయ్ క్రెటా రూ.10.87-19.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య, అల్కాజర్ రూ.16.77-21.12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య లభిస్తున్నారు. ఈ రెండు మోడల్స్ అడ్వెంచర్ ఎడిషన్ కార్ల ధరలు అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు.