స్పుత్నిక్ వ్యాక్సిన్ స్టోరేజ్ ఫ్రీజర్ల కోసం
హైదరాబాద్, జూన్ 9: స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను స్టోర్చేయడానికి అవసరమైన ఫ్రీజర్లు సరఫరా చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ తో రాక్వెల్ ఇండస్ట్రీస్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారీదారులు నిర్దేశించిన రిఫ్రిజిరేషన్ ప్రమాణాలకు అనుగుణంగా తాము వ్యాక్సిన్ ఫ్రీజర్లను, ఆఫ్టర్ సేల్స్ సర్వీసును అందిస్తామని రాక్వెల్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను దేశ వ్యాప్తంగా రెడ్డీస్ సరఫరా చేయనున్న సంగతి తెలిసిందే.