Hyderabad Office Space | ఆఫీస్ స్పేస్‌లో టాప్‌లో ఉన్న హైదరాబాద్‌లో 2021 జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో సరికొత్త ఆఫీస్ స్పేస్ జత కలిసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 46 లక్షల చదరపు అడుగుల స్పేస్ జత కలుస్తోంది. దీంతో 2021లో సుమారుగా 97 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చినట్లయింది.
ఇందులో 51 శాతం ఐటీ సెజ్ సెగ్మెంట్, 35 శాతం ఐటీ బీపీఎం, మరో 14 శాతం కమర్షియల్ సెగ్మెంట్ ఇముడ్చుకోనున్నాయి. జనవరి-సెప్టెంబర్ వరకు బీఎఫ్ఎస్ఐ 31 శాతం, ఐటీ-బీపీఎం 30 శాతం, ఫ్లెక్సిబుల్ స్పేస్ 28 శాతం, ఇంజినీరింగ్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, ఫార్మా రంగాలు 11 శాతం ఆఫీస్ స్పేస్ ఆక్రమించుకున్నాయి.
కొల్లియర్స్ ఆసియా మార్కెట్ డెవలప్మెంట్ ఇండియా సీఈవో కం ఎండీ రమేశ్ నాయర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ మూలాలు యధాతథంగా గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుత ఏడాది మూడో త్రైమాసికంలో భారీ లావాదేవీలు జరుగుతాయన్నారు. మూడో త్రైమాసికంలో మూడు రెట్లకు పైగా ఆఫీస్ స్పేస్‌ను పారిశ్రామిక రంగాలు తమలో ఇముడ్చుకోనున్నాయన్నారు. డెవలపర్స్, ఆక్యుపయ్యర్స్లో విశ్వాసం పెంపొందుతుందన్నారు.