న్యూఢిల్లీ, జనవరి 13 : వచ్చే ఏడాది మార్చిదాకా హైదరాబాద్‌లో 25 శాతం ఆఫీస్ స్పేస్ ఖాళీగానే ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అంచనా వేస్తున్నది. డిమాండ్‌కు మించి మార్కెట్లోకి కొత్తగా ఆఫీస్ స్పేస్ వస్తున్నదని ఐసీఆర్ఏ ప్రతినిధి అనుపమ రెడ్డి చెప్తున్నారు. ఇదిలావుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో తమ తొలి హౌజింగ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. కోకాపేట్లో 3 ఎకరాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను తెస్తున్నది.