బయోలాజిక్స్లో అమెరికాలో విస్తరణ దిశగా ఆరాజెన్..
బయోలాజిక్స్ రంగంలో అమెరికా, ఈయూ కస్టమర్లకు సేవలందించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అరాజెన్ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తు.....

హైదరాబాద్: బయోలాజిక్స్ రంగంలో అమెరికా, ఈయూ కస్టమర్లకు సేవలందించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అరాజెన్ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తున్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న అరాజెన్ (గతంలో జీవీకే బయో సైన్సెస్) ప్రపంచవ్యాప్తంగా 450 పై చిలుకు గ్లోబల్ ఫార్మా, బయోటెక్ కంపెనీలకు ఆవిష్కరణ, అభివృద్ధి, ఉత్పత్తి రంగాల్లో సేవలందిస్తున్నది. బయోలాజిక్స్లో సామర్థ్యం విస్తరణకు అమెరికా మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలో పెట్టుబడుల ప్రక్రియ చేపట్టింది. తద్వారా అమెరికా మార్కెట్లో విస్తరణ లక్ష్యంతో ముందుకు సాగుతున్నది.
గత ఐదు నుంచి ఏడేండ్లలో బయోలాజిక్స్ రంగంలో గణనీయ స్థాయిలో వృద్ధి రేటు పుంజుకుంటున్నదని తెలంగాణ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరాజెన్ సీఈవో కం డైరెక్టర్ మన్ని కంటెపూడి చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో మోర్గాన్ హిల్‌లో తమ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ ఇన్నోవేషన్ హాట్స్పాట్లలో కాలిఫోర్నియా ఒకటిగా ఉంది.

బయోలాజిక్స్లో లార్జ్ మాలిక్యూల్స్, స్మాల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఔషధాల అభివృద్ధిలో దీర్ఘకాలంలో స్మాల్ మాలిక్యూల్స్ పునాదిగా నిలుస్తాయి. మనుష్యుల్లోని ప్రోటీన్లకు లార్జ్ మాలిక్యూల్స్ ప్రతిరూపాలుగా ఉంటాయి. ఔషధాలను శరీరంలోని అవసరమైన భాగాలకు తరలించడంలో లార్జ్ మాలిక్యూల్స్ కీలకంగా వ్యవహరిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

