హైదరాబాద్, సెప్టెంబర్ 4: టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ సత్తాచాటుతున్నది. ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న నగరం..స్టార్టబ్ల కేంద్రంగా మారుతున్నదని జస్ట్‌డయల్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఐదు స్టార్టప్‌లు ప్రారంభమైతే..వీటిలో ఒకటి హైదరాబాద్ వేదికగా ఆవిర్భస్తున్నది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు దోహదం చేస్తున్నాయని, ప్రత్యేక ఏకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడం, దూరదృష్టి కలిగిన వ్యాపారవేత్తలకు మద్దతు ఇవ్వడంతో తిరుగులేని శక్తిగా నగరం నిలుస్తున్నదని అభిప్రాయపడింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పూణె వంటి నగరాలతోపాటు స్టార్టప్, సాంకేతిక ఆవిష్కరణలకు శక్తివంతమైన కేంద్రంగా నగరం అభివృద్ధి చెందుతున్నదని జస్ట్‌డయల్ పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. గణనీయమైన రీతిలో ఇప్పటి వరకు తెలంగాణలోకి 900 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అభివృద్ధి చెందుతున్న ఏ పర్యావరణ వ్యవస్థకైనా వ్యవస్థాపకులు కీలకం.