న్యూఢిల్లీ, నవంబర్ 13: దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు దన్నుగా నిలిచేందుకు హైదరాబాద్ ఏంజిల్ ఫండ్ ముందుకొచ్చింది. ప్రత్యేకంగా 15 నుంచి 20 స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నెలకొల్పింది.
వీటిలో మెరుగైన పనితీరు కనబరిచిన ఏఐ, గేమింగ్, స్పేస్‌టెక్, హెల్త్‌టెక్, కన్జ్యూమర్ టెక్, ఫిన్‌టెక్, ఎంటర్ప్రైజెస్ సాస్తోపాటు డ్రోన్లకు చెందిన స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయబోతున్నది.